గృహ రుణం ణం ఆదాయపు పన్నును ఎలా ఆదా చేస్తుంది
rimzim • August 28, 2020
ఆదాయపు పన్ను రెగ్యులేషన్స్ ప్రకారం హోమ్ లోన్ వినియోగదారులకు సెక్షన్ 80C, సెక్షన్ 24 మరియు సెక్షన్ 80EE అనుసరించి రిబేట్ పొందడానికి సహకార పడతాయి గృహ రుణం పొందడం వల్ల ఆదాయపు పన్ను నిబంధనల సెక్షన్ 80 సి, సెక్షన్ 24 మరియు సెక్షన్ 80 ఇఇ కింద పన్ను రాయితీలకు మీరు అర్హులు.
ముందుగా వీటి అర్హత ప్రమాణాలు తెలుసుకుందాం
ఉమ్మ డి గృహ రుణంపై పన్ను ప్రయోజనాలు, ఉమ్మ డి యజమానులకు అందుబాటులో ఉన్నా యి. ఆదాయపు పన్ను ప్రయోజనం పొందడానికి, సహ-రుణగ్రహీత కాకుండా యాజమాన్య హక్కు తప్ప నిసరి
1. కన్స్ట్రక్షన్ అయిపోయి ఉండాలి – ఇంటి నిర్మాణం పూర్తయిన ఆర్థిక సంవత్సరం నుండి పన్ను ప్రయోజనాలను క్లెయిమ్ చేయవచ్చు.
2. ఇంకా పూర్తికాని పని జరుగుతూ ఉన్న బిల్డింగ్ లకు పన్ను రాయితీ అమలు కాదు. అయితే ముందుగా కొన్ని వాయిదాలు చెల్లించిన ఎడల, సంవత్స రానికి 20% చప్పు న ఐదు సమాన వాయిదాలలో క్లెయిమ్ చేయబడతాయి
పన్ను ప్రయోజనాలకు వస్తే, మీరు 3 సెక్షన్ ల క్రింద ప్రయోజనాలను పొందవచ్చు
(1) వడ్డీ ప్రయోజనం u/s 24
మీ యొక్క బిల్డింగ్ గృహ ఉపయోగం కొరకు అయితే అత్య ధికంగా 200000 వరకు ఇంట్రెస్ట్ క్లెయిమ్ చేసుకోవచ్చు.
అటువంటి సందర్భంలో, ఆస్తిలో సహ యజమానులు కూడా హౌసింగ్ లోన్ యొక్క సహ-రుణగ్రహీతలు అయితే, ప్రతి సహ-రుణగ్రహీత సెక్షన్ 24 కింద ప్రయోజనం పొందటానికి అర్హులు.
మిగిలిన సందర్భాలలో అనగా స్వీయ ఆక్రమిత ఇల్లు కాని యెడల ఆ ఆర్థిక సంవత్సరం లో కట్టినటువంటి వడ్డీ పూర్తి మొత్తం కూడా సెక్షన్ 24 ప్రకారం క్లెయిమ్ చేసుకోవచ్చు.
అద్దెకు ఇచ్చినటువంటి ఇళ్ల పై వచ్చే ప్రయోజనం యాజమాన్య హక్కు పై ఆధారపడి ఉంటుంది.
(2) వడ్డీ ప్రయోజనం u/s 80EE
నిబంధనలు
a). మొదటిసారి ఇల్లు కొనే వారై ఉండాలి
b). ఇంటి యొక్క విలువ 50 లక్షలు మించకుండా ఉండాలి
C). తీసుకున్న లోన్ యొక్క విలువ 35 లక్షలు మించకుండా ఉండాలి
ఈ సెక్షన్ యొక్క ఉపయోగం గృహ ఉపయోగం కోసం కొనే ఇంటికి మాత్రమే వర్తిస్తుంది. ఈ విభాగం కింద గరిష్టంగా 50000 క్లెయిమ్ చేయవచ్చు
ఉమ్మ డి యాజమాన్యం విషయంలో, రుణం యొక్క సహ-రుణగ్రహీతలు ఆస్తి యాజమాన్యం యొక్క నిష్పత్తిలో గరిష్టంగా రూ .50 వేలకు లోబడి ప్రయోజనం పొందవచ్చు.
పైన తెలిపిన రెండు సెక్షన్స్ కు మీరు అర్హులు అయితే. రెండూ వర్తించబడుతుంది అందుకుగాను ముందుగా సెక్షన్ 24 క్లయిమ్ చేసిన తర్వాత u/s 80EE సెక్షన్ కోసం క్లెయిమ్ చేయవలసి ఉంటుంది.
ఉదాహరణకు 2018-19 ఆర్థిక సంవత్సరం కు గాను వడ్డీ Rs.230000 అయితే :
సెక్షన్ 24 ప్రకారం Rs.2,00,000 మరియు సెక్షన్ 80EE ప్రకారం మిగిలిన Rs.30,000 క్లెయిమ్ పొందవచ్చు.
(3) అసలు మీద u/s 80C ఉపయోగాలు
పిపిఎఫ్, ఎన్ఎస్సి మరియు ఇతర పెన్షన్ పథకాలలో పెట్టుబడులను ప్రోత్సహించడానికి, సెక్షన్ 80 సి, పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం నుండి మినహాయింపును అందిస్తుంది. ఈ విభాగం కింద, ఈ పథకాలలో పెట్టుబడి పెట్టిన మొత్తానికి మినహాయింపు లభిస్తుంది.
గృహ రుణం పై చెల్లించిన అసలు కూడా ఈ పరిధిలోకి వస్తుంది.
అయితే సెక్షన్ 80C కింద అత్యధికంగా 150000 కు మించి ఉపయోగం పొందడానికి ఆస్కారం లేదు
ఉదాహరణకు, మొత్తం పెట్టుబడి Rs.1,00,000 మరియు కట్టిన అసలు Rs.75,000 అయితే Rs.1,50,000 (Rs.1,00,000 మొత్తం పెట్టుబడి మీద మరియు Rs.50,000 కట్టిన అసలు మీద) మీరు ప్రయోజనం పొందవచ్చు. మిగిలిన Rs.25,000కు ప్రయోజనం పొందడం కుదరదు.
ఉమ్మడి గృహ రుణం అయితే, ప్రతి సహరుణ గ్రహీత కు ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది.
సెక్షన్ 80/C ప్రకారం ప్రయోజనం పొందాలంటే కేవలం వడ్డీ మాత్రమే కాకుండా, అసలు కూడా కట్టవలసి ఉంటుంది.